రామ్ గోపాల్ వర్మ వేసిన దీపావళి బాంబ్ ఇదే... 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ట్రయిలర్ చూడండి!
Advertisement
సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ, రెండు రోజుల క్రితం చెప్పినట్టుగానే, దీపావళి నాడు బాంబ్ ను వేస్తున్నానని చెబుతూ, తన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ట్రయిలర్ ను ఈ ఉదయం విడుదల చేశారు. నవంబర్ లో సినిమా విడుదల కానుండగా, ట్రయిలర్ ను చూస్తుంటే, "బ్రేకింగ్ న్యూస్... మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన బాబు పార్టీ చరిత్రలోనే ఎవ్వరూ రుచి చూడనంత ఘోర పరాజయాన్ని చవి చూసిన తరువాత... కొన్ని చాలా విపరీత పరిస్థితులు ఏర్పడుతున్నాయి" అన్న వర్మ కామెంట్రీతో ట్రయిలర్ మొదలవుతుంది. ఆపై ఇందులోని సన్నివేశాలు చూస్తుంటే, ఏపీ రాజకీయాలు ఎలా మారాయో చూపించాయన్న విషయాలను వర్మ స్పృశించాడని తెలుస్తోంది. "ఆ దేవుడే నన్ను వెన్నుపోటు పొడిచాడు ఉమా..." అన్న బాబు పాత్రధారి డైలాగ్, "చినబాబుని సీఎం చేసే పూచీ నాది" అనే డైలాగులున్నాయి. లోకేశ్, నారా బ్రాహ్మణి తదితరుల పాత్రలూ కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ పాత్ర కూడా కనిపిస్తోంది. బ్రహ్మానందం, అలీలు కామెడీని పండించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఈ ట్రయిలర్ ను మీరూ చూడండి.
Sun, Oct 27, 2019, 12:30 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View