కులమతాలకు అతీతంగా భారతీయులందరూ జరుపుకునే పండుగ దీపావళి: పవన్ కల్యాణ్
26-10-2019 Sat 17:57
- ప్రజలకు జనసేనాని దీపావళి శుభాకాంక్షలు
- కొత్తకాంతులు తీసుకురావాలని ఆకాంక్ష
- పరిమితంగా బాణసంచా కాల్చాలని సూచన

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపాన్ని భారతీయులు పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారని, మనోవికాసానికి ప్రతీకగా పరిగణిస్తారని ట్విట్టర్ లో వివరించారు. కులమతాలకు అతీతంగా భారతీయులందరూ జరుపుకునే పండుగ దీపావళి అని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని శ్రమజీవుల జీవితాల్లో ఈ దీపకాంతులు కొత్త కాంతులు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. వర్షాకాలంలో వచ్చే క్రిమికీటకాలు అనారోగ్యాలు కలిగిస్తుంటాయని, వాటిని పారద్రోలేందుకే దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చుతుంటారని పవన్ వెల్లడించారు. అయితే పర్యావరణానికి భంగం కలగని రీతిలో పరిమితంగా బాణసంచా కాల్చాలని సూచించారు.
ADVERTSIEMENT
More Telugu News
తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
6 hours ago

తెలంగాణలో తాజాగా 29 మందికి కరోనా
7 hours ago

అల్మోరా ప్రాంతం నుంచి ఈ స్వీట్ తీసుకురమ్మని ప్రధాని మోదీ చెప్పారు: బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్
8 hours ago

రైలెక్కిన బస్సులు... వీడియో ఇదిగో!
8 hours ago

దావోస్ లో వరుస సమావేశాలతో సీఎం జగన్ బిజీ
9 hours ago

సంచలన పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు టీమిండియాలో చోటు... దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు జట్టు ఎంపిక
10 hours ago
