నిఖిల్ సినిమా విడుదలకి ముహూర్తం కుదిరింది
Advertisement
నిఖిల్ మొదటి నుంచీ కూడా కథాకథనాల్లో కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకువెళుతున్నాడు. అలాగే ఆయన సంతోష్ దర్శకత్వంలో 'అర్జున్ సురవరం' సినిమాను చేశాడు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమా, కొంతకాలం క్రితమే ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ కొన్ని కారణాల వలన విడుదల తేదీలు వాయిదా పడుతూ వచ్చాయి.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. నవంబర్ 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల కోసం నిఖిల్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు. తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో. అలాగే కెరియర్ పరంగా జోరు తగ్గిన లావణ్య త్రిపాఠికి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.
Sat, Oct 26, 2019, 03:30 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View