చిరంజీవి చిన్నల్లుడు హీరోగా 'సూపర్ మచ్చి' .. ఫస్టులుక్ రిలీజ్
Advertisement .b
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ ఆ మధ్య 'విజేత' సినిమా ద్వారా పరిచయమయ్యాడు. ఆ సినిమా సక్సెస్ కాకపోయినా, లుక్స్ పరంగా మంచి పేరే తెచ్చింది. ఆయన రెండవ సినిమాకి పులివాసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని సినిమాకి తాజాగా 'సూపర్ మచ్చి' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, కొంతసేపటి క్రితం ఫస్టులుక్ ని వదిలారు. వర్షంలో .. జనం మధ్యలో విజయోత్సాహంతో కల్యాణ్ దేవ్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. టైటిల్ ను బట్టి .. లుక్ ను బట్టి మాస్ అంశాలు ఎక్కువగా కలిగిన మూవీ అనే విషయం అర్థమవుతోంది. తమన్ స్వరాలను సమకూర్చిన ఈ సినిమా, ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను జరుపుకుంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో, కల్యాణ్ దేవ్ జోడీగా 'రియా చక్రవర్తి' కనిపించనుంది. వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Sat, Oct 26, 2019, 12:18 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View