హారర్ థ్రిల్లర్ గా విడుదలకి సిద్ధమవుతున్న 'ఆవిరి'
Advertisement
తెలుగు తెరపై నటుడిగానే కాదు .. దర్శకుడిగా కూడా రవిబాబు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్లు .. హారర్ థ్రిల్లర్లు తెరకెక్కించడంలో ఆయన తనదైన ప్రత్యేకతను చూపుతూ వస్తున్నాడు. 'అవును' వంటి హారర్ థ్రిల్లర్ తో విజయాన్ని అందుకున్న ఆయన, అదే జోనర్లో 'ఆవిరి' టైటిల్ తో మరో సినిమాను రూపొందించాడు. నేహా చౌహాన్ ప్రధాన పాత్రధారిగా ఈ సినిమా నిర్మితమైంది.


ఆత్మల నేపథ్యంలో సాగే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ఇప్పటికే అందరిలో ఆసక్తిని పెంచేశాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, U/A సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. నవంబర్ 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఓ పది .. పన్నెండేళ్ల అమ్మాయి ఆత్మ, మెట్ల పైభాగంలో నుంచుని చూస్తున్నట్టుగా వున్న కొత్త పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది. దిల్ రాజు సమర్పిస్తున్న ఈ సినిమా, ప్రేక్షకులను ఏ స్థాయిలో భయపెడుతుందో చూడాలి.
Sat, Oct 26, 2019, 11:52 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View