సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  
Advertisement .b
*  వివిధ భారతీయ భాషల్లో 'మహాభారత్' చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం విదితమే. అల్లు అరవింద్ తో కలసి మధు మంతెన నిర్మిస్తున్న ఈ చిత్రంలో వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటులు నటిస్తున్నారు. ఈ క్రమంలో ఇందులో ద్రౌపది పాత్రకు బాలీవుడ్ నటి దీపిక పదుకొనేను ఎంపిక చేసినట్టు తాజా సమాచారం.
*  తరుణ్ భాస్కర్ హీరోగా హీరో విజయ్ దేవరకొండ నిర్మించిన 'మీకు మాత్రమే చెబుతా' చిత్రాన్ని నవంబర్ 1న రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం శాటిలైట్ హక్కులను మాటీవీ రెండు కోట్లకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది.
*  శర్వానంద్, సమంత కలసి నటిస్తున్న తమిళ హిట్ చిత్రం '96' రీమేక్ షూటింగ్ ముగింపు దశకు చేరింది. ఇక మరికొన్ని రోజుల వర్క్ మాత్రం బ్యాలెన్స్ గా వుంది. కాగా, ఈ చిత్రాన్ని ఫిబ్రవరి రెండో వారంలో వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్  చేస్తున్నారు.
Sat, Oct 26, 2019, 07:31 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View