బిగ్‌బాస్ ఫైనల్‌లో బాబా భాస్కర్.. ప్రేక్షకులకు ఫినాలే టికెట్‌ను అంకితమిచ్చిన బాబా
Advertisement
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-3 చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో వరుణ్, రాహుల్, బాబా భాస్కర్, అలీ, శ్రీముఖి, శివజ్యోతి ఉన్నారు. వీరిలో ఐదుగురు పైనల్‌కు చేరుకోనున్నారు. ఇప్పటికే రాహుల్ టాప్-5కి చేరుకోగా, నిన్న బాబా భాస్కర్ కూడా ఆ జాబితాలో చేరాడు. ప్రస్తుతం ఇంటిలో ఆరుగురు సభ్యులు ఉండగా, ఎలిమినేట్ అయ్యే ఆ ఒక్కరు ఎవరన్నది సస్పెన్స్‌గా మారింది.  
 
నిన్నటి షోలో బిగ్‌బాస్ అందరినీ గార్డెన్ ఏరియాలోకి పిలిచి వాళ్ల జర్నీ విశేషాలు చెప్పమని ఆదేశించాడు. దీంతో ఒక్కొక్కరు తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న బాబా భాస్కర్‌ ఫైనల్‌లోకి ప్రవేశించినట్టు బిగ్‌బాస్ పేర్కొన్నాడు. ప్రేక్షకులు తమ ఓట్ల ద్వారా బాబాను రక్షించి ఫైనల్‌కు పంపినట్టు చెప్పడంతో బాబా భాస్కర్ ఆశ్చర్యపోయాడు. బిగ్‌బాస్‌కు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. అనంతరం బాబాను కన్ఫెషన్‌ రూముకి పిలిచిన బిగ్‌బాస్ ‘టికెట్ టు ఫినాలే’ను అందించాడు. దానిని చూసి మురిసిపోయిన బాబా టికెట్ టు ఫినాలేను ప్రేక్షకులకు అంకితమిస్తున్నట్టు పేర్కొన్నాడు.
Sat, Oct 26, 2019, 07:09 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View