మరోసారి కథాబలం ఉన్న చిత్రానికే వెంకీ మొగ్గు.... తెలుగులో 'అసురన్' రీమేక్
Advertisement
వెట్రిమారన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్ ద్విపాత్రాభినయం చేసిన 'అసురన్' చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. దసరా సీజన్ లో విడుదలై నేటికీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సందడి చేస్తున్న ఈ సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేశ్ రీమేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం వెంకీ మామ చిత్రంలో నటిస్తున్న వెంకటేశ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గా మరోసారి కథా బలమున్న చిత్రాన్నే ఎంచుకున్నాడు. 'అసురన్'లో విలక్షణమైన కథ ఉండడంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అందుకే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

'అసురన్' మూవీని తెలుగులో కలైపులి ఎస్ థాను, సురేశ్ బాబు సంయుక్తంగా నిర్మించనున్నారు. 'అసురన్' చిత్రాన్ని తమిళంలో కలైపులి ఎస్ థాను నిర్మించారు. కాగా, తెలుగు రీమేక్ లో వెంకీ సరసన నటించేది ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు.
Fri, Oct 25, 2019, 05:58 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View