100 రోజులు పూర్తిచేసుకోనున్న 'ఇస్మార్ట్ శంకర్'
Advertisement
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా ఈ ఏడాది జూలై 18వ తేదీన 'ఇస్మార్ట్ శంకర్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ముఖ్యంగా మాస్ ఏరియాల్లో ఈ సినిమా విజయవిహారం చేసింది. ఆ తరువాత విడుదలైన చాలా సినిమాల పోటీని తట్టుకుంటూ నిలబడిన ఈ సినిమా, ఈ రోజుతో 100 రోజులను పూర్తి చేసుకోనుంది.

రామ్ మాస్ లుక్ .. ఆయన తెలంగాణ యాస మాట్లాడటం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇటు నిధి అగర్వాల్ .. అటు నభా నటేశ్ గ్లామర్ డోస్ పెంచేయడం మాస్ ఆడియన్స్ నుంచి మరిన్ని మార్కులు దక్కడానికి కారణమైంది. ఇక మణిశర్మ అందించిన బాణీలు మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేశాయి. చాలాకాలం తరువాత పూర్తి పూరి మార్కుతో వచ్చిన కారణంగానే ఈ సినిమాకి ఈ స్థాయి విజయం లభించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Fri, Oct 25, 2019, 09:40 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View