చిరంజీవి ఇంట్లో సీనియర్ తారలకు పార్టీ!
Advertisement
1980వ దశకంలో కలిసి నటించిన తారలంతా కలిసి 'క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌' పేరిట ఓ క్లబ్ ను పెట్టుకుని, ప్రతి సంవత్సరం ఏదో ఒకచోట కలుసుకుని పార్టీ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. ఈ గ్రూప్ లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, మోహన్ లాల్, అర్జున్, జాకీఫ్రాఫ్, రమ్యకృష్ణ, ప్రభు, మోహన్ లాల్, సుమలత, శోభన, సుహాసిని, రాధిక, సుమన్, భాగ్యరాజ్, శరత్ కుమార్, సత్యరాజ్, ఖుష్బూ, నదియా, జయరామ్ వంటివారున్నారు.

ఈ గ్రూప్ లోని వారే ఒక్కో సంవత్సరం ఒక్కో చోట పార్టీని ఎరేంజ్ చేస్తుంటారు. ఓ స్టార్ మిగతా అందరికీ పార్టీ ఇస్తారు. ఇక ఈ సంవత్సరం పార్టీని చిరంజీవి హోస్ట్ చేయనున్నారని తెలుస్తోంది. ఇటీవల తన ఇంటిని రీ మోడలింగ్ చేయించిన చిరు, వచ్చే నెలలో జరిగే పార్టీకి అందరినీ పిలిచి, గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక, 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్' జరుపుకుంటున్న పదవ పార్టీ ఇదే కానుంది.
Fri, Oct 25, 2019, 08:26 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View