బండ్ల గణేశ్ కు బెయిల్ మంజూరు
Advertisement
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కు బెయిల్ లభించింది. చెక్ బౌన్స్ కేసులో ఈ మధ్యాహ్నం కడప కోర్టు బండ్ల గణేశ్ కు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. కోర్టు ఉత్తర్వుల ప్రకారం నవంబర్ 4 వరకు ఆయన రిమాండ్ కొనసాగాల్సి ఉంది. అయితే, ఊహించని విధంగా ఆయనకు బెయిల్ రావడం గమనార్హం. మరోవైపు, బెయిల్ రావడంతో... కడప నుంచి హైదరాబాదుకు బండ్ల గణేశ్ బయల్దేరారు. చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే.
Thu, Oct 24, 2019, 04:35 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View