'విజిల్' సెన్సార్ పూర్తి.. విడుదలకి సిద్ధం
Advertisement
విజయ్ కథానాయకుడిగా అట్లీకుమార్ దర్శకత్వంలో 'బిజిల్' రూపొందింది. ఫుట్ బాల్ కోచ్ గా విజయ్ కనిపించనున్న ఈ సినిమాలో ఆయన జోడీగా నయనతార కనిపించనుంది. తమిళంతోపాటు తెలుగులోను ఈ సినిమాను రేపు విడుదల చేయనున్నారు. 'విజిల్' టైటిల్ తో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

తెలుగు వెర్షన్ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఈ సినిమా పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు. ఆల్రెడీ అట్లీ కుమార్ - విజయ్ కాంబినేషన్లో రెండు హిట్లు పడటం .. ఈ సినిమాలో విజయ్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనుండటం .. కథానాయిక నయనతార కావడంతో అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి.
Thu, Oct 24, 2019, 03:37 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View