భారీ రేటుకు 'తిప్పరా మీసం' శాటిలైట్ హక్కులు
Advertisement
మొదటి నుంచీ కూడా శ్రీవిష్ణు వైవిధ్యభరితమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నాడు. తాజా చిత్రంగా ఆయన 'తిప్పరా మీసం' చేశాడు. కృష్ణవిజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, వచ్చేనెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను తాము దక్కించుకున్నట్టుగా జెమినీ టీవీ వారు తెలియజేశారు. శాటిలైట్ హక్కులకుగాను భారీ రేటు చెల్లించినట్టుగా సమాచారం. యాక్షన్ రివేంజ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో, శ్రీవిష్ణు జోడీగా నిక్కీ తంబోలి కనిపించనుంది. విభిన్నమైన లుక్ లో శ్రీవిష్ణు కనిపించనున్న ఈ సినిమా, ఆయనకి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.
Thu, Oct 24, 2019, 03:14 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View