అందుకే బిగ్ బాస్ హౌస్ నుంచి శ్రీముఖి బ్యాచ్ నన్ను బయటికి పంపించింది: నటి హేమ
Advertisement
'బిగ్ బాస్ 3' రియాలిటీ షోలో పాల్గొన్న హేమ .. మొదటివారంలోనే హౌస్ లో నుంచి బయటికి వచ్చేసింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, 'బిగ్ బాస్ 3'కి సంబంధించిన విషయాలను ప్రస్తావించింది. 'బిగ్ బాస్ హౌస్'లో నుంచి నేను బయటికివచ్చిన తరువాత, 'హిమజ' ఎలిమినేట్ అయ్యేంతవరకూ మాత్రమే చూశాను.

ఎందుకంటే మిగతా వాళ్లంతా ఒక గ్రూప్. వాళ్లందరి మధ్య ఒక ఒప్పందమనేది ముందుగానే జరిగిపోయింది. శ్రీముఖి పుట్టిన రోజున వీళ్లంతా సమావేశమై, 'ఏదో ఒకటి చేసి ముందుగా హేమను బయటికి పంపించేయాలి. లేదంటే తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిపోతుంది' అనుకునే వచ్చారట. ఆ విషయాన్ని మనసులో పెట్టుకునే నన్ను రెచ్చగొట్టారు. వాళ్ల ఆంతర్యం తెలియక నేను నా స్టైల్లో సమాధానం చెప్పడం .. ఎలిమినేషన్ లోకి వచ్చేయడం జరిగిపోయింది" అని చెప్పుకొచ్చింది.
Thu, Oct 24, 2019, 02:43 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View