'జాతిరత్నాలు'గా ముగ్గురు ఖైదీలు .. మోషన్ పోస్టర్ రిలీజ్
Advertisement
'మహానటి' సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభా పాటవాలను చాటుకున్న నాగ్ అశ్విన్, నిర్మాతగా 'జాతిరత్నాలు' అనే సినిమాను నిర్మిస్తున్నాడు. అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇంతవరకూ 75 శాతం చిత్రీకరణను జరుపుకుంది. నవీన్ పోలిశెట్టి .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.

దీపావళి సందర్భాన్ని పురస్కరించుకుని కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రధాన పాత్రధారులైన ముగ్గురూ ఈ పోస్టర్లో ఖైదీలుగా కనిపిస్తున్నారు. ఈ ముగ్గురి చుట్టూనే ఈ కథ తిరుగుతుందనే విషయం అర్థమవుతోంది. రధన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ కామెడీ థ్రిల్లర్, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Thu, Oct 24, 2019, 02:15 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View