నేను డబ్బుమనిషినని అంటారు .. ఎవరు పనిచేసినా దాని కోసమేగదా: బిత్తిరి సత్తి
Advertisement
తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో 'బిత్తిరి సత్తి' పాల్గొన్నాడు. "మీరు మంచి టాలెంటెడ్ అని మీ గురించి తెలిసినవాళ్లు చెప్పారు. అలాగే మీరు విపరీతమైన డబ్బు మనిషి అని కూడా అన్నారు. దీనిపై మీరు ఏమంటారు?" అనే ప్రశ్న 'బిత్తిరి సత్తి'కి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "నేను ఇక్కడికి బతకడానికి వచ్చాను .. సమాజ సేవ చేయడానికి కాదు.

నేను చేసిన పనికి డబ్బులు అడిగితే అది ఎలా తప్పు అవుతుంది. ఛానల్ వారికి కావలసింది టీఆర్పీ .. నాకు కావలసింది డబ్బు. నన్ను డబ్బు మనిషి అంటున్నారు .. డబ్బు ఎవరికి వద్దు .. డబ్బుతో అవసరం లేనిది ఎవరికి? అందరిలాగే నాకూ ఒక మంచి ఇల్లు ఉండాలనీ .. ఒక కారులో తిరగాలని ఉంటుంది గదా. నేను పనిచేసేదే డబ్బు కోసం .. నాకు తెలిసింది పనిచేయడమే .. మోసం చేయడం అసలే తెలియదు" అని చెప్పుకొచ్చాడు.
Thu, Oct 24, 2019, 01:52 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View