పూరితో సినిమా చేయడానికి నేను సిద్ధం: సల్మాన్
Advertisement
సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా హిందీలో 'దబాంగ్ 3' రూపొందింది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, సల్మాన్ సరసన నాయికగా సోనాక్షి సిన్హా నటించింది. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సల్మాన్ ఓ వేదికపై మాట్లాడుతూ, పూరి జగన్నాథ్ తనతో సినిమా చేస్తానంటే చేయడానికి తాను సిద్ధంగా వున్నానని చెప్పాడు.

 తెలుగులో పూరి చేసిన 'పోకిరి' సినిమాను హిందీలో సల్మాన్ హీరోగా ప్రభుదేవా తెరకెక్కించగా అక్కడ అది 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అప్పటి నుంచి పూరి సినిమాల్లో కంటెంట్ పై సల్మాన్ కి మంచి నమ్మకం వుంది. ఈ కారణంగానే ఆయన పూరితో సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతున్నాడని అంటున్నారు. విజయ్ దేవరకొండతో 'ఫైటర్' పూర్తికాగానే, సల్మాన్ తో పూరి సెట్స్ పైకి వెళ్లినా ఆశ్చర్యంలేదని చెప్పుకుంటున్నారు.
Thu, Oct 24, 2019, 11:37 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View