నాని నిర్మాతగా ప్రారంభమైన 'హిట్' మూవీ
Advertisement
ఒక వైపున కథానాయకుడిగా వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తున్న నాని, నిర్మాతగా కూడా విభిన్నమైన కథలనే ఎంచుకుంటున్నాడు. కంటెంట్ లో కొత్తదనం వుంటే చాలు తన బడ్జెట్ పరిథిలోని నటీనటులతో సినిమాలను నిర్మిస్తున్నాడు. అలా ఆ మధ్య 'అ' సినిమా చేసిన ఆయన, తాజాగా మరో సినిమాను నిర్మించడానికి రంగంలోకి దిగాడు.

నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలను జరుపుకుంది. విష్వక్సేన్ ను కథానాయకుడిగా .. రుహాని శర్మను నాయికగా ఎంపిక చేసుకున్న ఆయన, ఈ సినిమాకి 'హిట్' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు. మరో నిర్మాతగా ప్రశాంతి వ్యవహరిస్తున్న ఈ సినిమాతో, దర్శకుడిగా శైలేశ్ పరిచయం అవుతున్నాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని 'వి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
Thu, Oct 24, 2019, 10:24 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View