'ఇద్దరి లోకం ఒకటే' నుంచి లిరికల్ వీడియో సాంగ్
Advertisement .b
రాజ్ తరుణ్ కథానాయకుడిగా జీఆర్ కృష్ణ దర్శకత్వంలో 'ఇద్దరి లోకం ఒకటే' చిత్రం రూపొందింది. ఈ ప్రేమకథా చిత్రంలో రాజ్ తరుణ్ జోడీగా షాలినీ పాండే నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

"లా ల లా ల లా నిజంలా నా కలా .. లా ల లా ల లా నీవల్లే నేనిలా .." అంటూ ఈ పాట సాగుతోంది. రాజ్ తరుణ్ - షాలినీ పాండేపై ఈ పాటను చిత్రీకరించారు. మిక్కీ జె.మేయర్ స్వరపరిచిన ఈ బాణీ చక్కని ఫీల్ ను కలిగిస్తూ సాగుతోంది. ఈ పాటకి తన ఆలాపనతో సమీరా భరద్వాజ్ ప్రాణం పోసింది. 'ఒక నిన్న లోంచి నన్నుకోరి పూసే నేడిలా' అంటూ శ్రీమణి చేసిన పద ప్రయోగాలు బాగున్నాయి. యూత్ కి నచ్చేలా .. వాళ్ల హృదయాలను వెంటనే పట్టేసేలా ఈ పాట వుంది. వచ్చేనెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Wed, Oct 23, 2019, 05:38 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View