'ఖాకీ' మాదిరిగానే 'ఖైదీ' గుర్తుండిపోతుంది: హీరో కార్తీ
Advertisement .b
కార్తీకి కొంతకాలంగా చెప్పుకోదగిన హిట్ పడలేదు. దాంతో కార్తీతో పాటు ఆయన అభిమానులంతా కూడా అసంతృప్తితో వున్నారు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన చేసిన సినిమానే 'ఖైదీ'. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో కార్తీ మాట్లాడుతూ .. "నా కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలలో 'ఖాకీ' ఒకటి. మొదటి నుంచి చివరివరకూ ఈ సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుంది. అందువలన ఆ సినిమాను ప్రేక్షకులు మరిచిపోలేదు. అదే తరహాలో పూర్తి ఉత్కంఠభరితంగానే 'ఖైదీ' సినిమా సాగుతుంది. లారీతో లైవ్ స్పీడ్ లో చేసిన యాక్షన్ సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ సినిమా, ప్రేక్షకులందరికీ కనెక్ట్ అవుతుంది" అని చెప్పుకొచ్చాడు.
Wed, Oct 23, 2019, 04:16 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View