'ఇద్దరి లోకం ఒకటే' పైనే రాజ్ తరుణ్ ఆశలు
Advertisement .b
ఆ మధ్య రాజ్ తరుణ్ వరుస సినిమాలు చేశాడు. అయితే వాటిలో ఏ ఒక్కటీ కూడా విజయాన్ని సాధించలేదు. దాంతో కథల ఎంపిక విషయంలో రాజ్ తరుణ్ జాప్యం చేయడం .. మిగతా కుర్ర హీరోలు ముందుకెళ్లిపోవడం జరిగిపోయాయి. ఈ క్రమంలో ఈ మధ్యనే రాజ్ తరుణ్ ఒక కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. 'ఇద్దరి లోకం ఒకటే' టైటిల్ తో చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా, విడుదలకి సన్నాహాలు చేసుకుంటోంది.

ఈ సినిమా రాజ్ తరుణ్ కి తప్పకుండా హిట్ తెచ్చిపెట్టాలి. లేదంటే ఆయన కెరియర్ మరింత రిస్క్ లో పడుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన రాజ్ తరుణ్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో బయ్యర్లు అంతగా ఆసక్తిని చూపడం లేదనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇది రాజ్ తరుణ్ ని మరింత టెన్షన్ పెట్టే విషయమే. ఈ గండాన్ని రాజ్ తరుణ్ ఎలా గట్టెక్కుతాడో చూడాలి.
Wed, Oct 23, 2019, 03:23 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View