'ఆడై' హిందీ రీమేక్ లో కంగన?
Advertisement
ఈ ఏడాది ద్వితీయార్థంలో అమలాపాల్ ప్రధాన పాత్రధారిగా తమిళంలో 'ఆడై' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ఆమె' టైటిల్ తో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. ఈ సినిమాలో అమలా పాల్ చాలా వరకూ నగ్నంగా కనిపిస్తుంది. ఆమె చేసిన ఈ సాహసం అంతా ఆశ్చర్యపోయేలా చేసింది. అయినా ఈ సినిమా అటు తమిళంలోగానీ, ఇటు తెలుగులోగాని విజయవంతం కాలేదు.

అయితే ఈ తరహా కథను కొద్దిగా మార్చుకుంటే బాలీవుడ్ వారికి బాగా ఎక్కుతుందనే ఉద్దేశంతో, హిందీ రీమేక్ హక్కులను విక్రమ్ భట్ సొంతం చేసుకున్నాడట. ఈ పాత్రకి కంగన అయితే బాగుంటుందనే ఉద్దేశంతో, ఆమెతో సంప్రదింపులు మొదలెట్టాడని అంటున్నారు. కథాకథనాల్లోను .. మేకింగ్ విషయంలోను కంగన జోక్యం ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ ప్రాజెక్టు ఎంతవరకూ సెట్ అవుతుందో చూడాలి.
Wed, Oct 23, 2019, 02:26 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View