బాలు గారితో కలిసి పాడటం నా పూర్వజన్మ సుకృతం: సింగర్ బేబీ
Advertisement
ఎక్కడో మారుమూల గ్రామంలో పొలం పనులు చేసుకుంటూ పాటలు పాడుకునే బేబీ, సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టిలో పడింది. స్టేజ్ షోలలోను .. సినిమాల్లోను పాడుతూ బిజీ అయింది. అలాంటి బేబీ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకుంది.

"సంగీత దర్శకులు కోటి గారు 'బోల్ బేబీ బోల్' కార్యక్రమం ద్వారా నన్ను పరిచయం చేశారు. ఆ తరువాత చిరంజీవి గారు అభినందించిన కారణంగా నేను ఎవరనేది అందరికీ తెలిసింది. ఇటీవల ఓ నాలుగైదు సినిమాల్లో పాటలు పాడాను. 'పలాస' సినిమా కోసం సంగీత దర్శకుడు రఘు కుంచె గారు నాతో ఒక పాట పాడించారు. బాలుగారితో కలిసి ఆ పాట పాడాను. నాతో ఆ పాట పాడటం తన అదృష్టమని బాలుగారు అనడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. ఆయనతో పాడటం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.
Wed, Oct 23, 2019, 01:16 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View