'రంగమార్తాండ' కోసం రంగంలోకి పరుచూరి బ్రదర్స్
Advertisement
పరుచూరి బ్రదర్స్ కలం బలం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. కథ .. కథనం .. సంభాషణలతో వాళ్లు తమదైన ముద్రను వేస్తూ 350 సినిమాలకి పైగా చేశారు. చిత్రపరిశ్రమలోని అగ్రకథానాయకులు తాము తాజాగా ఎంచుకున్న కథలను ఒకసారి పరిశీలించమని పంపుతూ, వాళ్లు చేసిన మార్పులను .. చేర్పులను స్వీకరిస్తుంటారు.

అలాంటి పరుచూరి బ్రదర్స్, కృష్ణవంశీ ప్రాజెక్టు కోసం రంగంలోకి దిగారనేది తాజా సమాచారం. 2016లో మరాఠీలో విజయవంతమైన 'నటసామ్రాట్' సినిమాను తెలుగులో చేయడానికి కృష్ణవంశీ సిద్ధమయ్యాడు. ఈ సినిమాకి 'రంగమార్తాండ' అనే టైటిల్ ను కూడా ఖరారు చేసేసుకున్నాడు. ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగినట్టుగా రూపొందించడం కోసం ఆయన పరుచూరి బ్రదర్స్ సాయాన్ని కోరగా, వాళ్లు రంగంలోకి దిగినట్టుగా సమాచారం. స్క్రిప్ట్ పై వాళ్ల కసరత్తు పూర్తికాగానే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.
Wed, Oct 23, 2019, 11:26 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View