ధనుశ్ మూవీ రీమేక్ పై ఆసక్తిని చూపుతున్న చరణ్
Advertisement
కొరటాల మూవీ తరువాత చిరంజీవి కథానాయకుడిగా ఓ మలయాళ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో చరణ్ వున్నాడు. మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా రూపొందిన 'లూసిఫర్' ను తెలుగులోకి రీమేక్ చేయాలనే ఉద్దేశంతో చరణ్ ఆ హక్కులను దక్కించుకున్నాడు. ఇక తన కోసం ఆయన ఒక తమిళ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

తమిళంలో ధనుశ్ హీరోగా చేసిన 'అసురన్' దసరాకి విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చాలా వేగంగా ఈ సినిమా అక్కడ 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. కేవలం హిట్ కొట్టడమే కాదు .. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. వెట్రిమారన్ దర్శక ప్రతిభకు .. ధనుశ్ నటనకు అవార్డులు దక్కడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగానే 'అసురన్' రీమేక్ హక్కులపై చరణ్ ఇంట్రెస్ట్ చూపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు.
Wed, Oct 23, 2019, 10:57 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View