'విజిల్' టీమ్ నుంచి గ్రామీణ క్రికెటర్లకు కానుక
Advertisement .b
అట్లీ కుమార్ .. విజయ్ కాంబినేషనన్లో తమిళంలో రూపొందిన 'బిజిల్' .. దీపావళి పండుగ కానుకగా ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈ సినిమాను 'విజిల్' పేరుతో అదే రోజున భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు హైదరాబాదులో ఘనంగా నిర్వహించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి.

ఫుట్ బాల్ క్రీడ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అందువలన ఈ సినిమా టీమ్, గ్రామీణ ప్రాంతాల్లో ఫుట్ బాల్ క్రీడాభివృద్ధికి తోడ్పడే 'మార్స్' ఫుట్ బాల్ ఫౌండేషన్ ద్వారా 40 మంది బాలబాలికలకు ఫుట్ బాల్ కిట్స్ ను అందించనుంది. విజయ్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన నాయికగా నయనతార కనిపించనుంది.
Wed, Oct 23, 2019, 09:34 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View