సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించాలని ప్రతి కథానాయిక ఆశపడుతుంది. తాజాగా ఆ ఛాన్స్ కీర్తిసురేశ్ కి వచ్చినట్టుగా చెబుతున్నారు. 'దర్బార్' తర్వాత రజనీ తన తదుపరి చిత్రాన్ని మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో చేయనున్నారు. ఇందులో ఓ నాయిక పాత్రకు కీర్తిని ఎంచుకున్నట్టు సమాచారం.
*  ప్రస్తుతం 'జాన్' చిత్రాన్ని చేస్తున్న ప్రభాస్ త్వరలో కొత్త చిత్రాన్ని ఫైనలైజ్ చేయనున్నాడు. ఈ రోజు తన 40వ పుట్టిన రోజును లండన్ లో స్నేహితుల సమక్షంలో జరుపుకుంటున్న ప్రభాస్, అక్కడి నుంచి రాగానే తన కొత్త సినిమాపై క్లారిటీ ఇస్తాడని తెలుస్తోంది. సురేందర్ రెడ్డి, పరశురాం తదితరులు ఆయనతో సినిమా చేయడానికి కథలతో సిద్ధంగా వున్నారు. మరి ఎవరి ప్రాజక్టుకు ప్రభాస్ ముందుగా ఓకే చెబుతాడో చూడాలి!
*  దక్షిణాది భాషల్లో స్టార్ హీరోయిన్ గా, క్యారెక్టర్ నటిగా రాణించిన ప్రముఖ నటి షావుకారు జానకి తాజాగా తన 400వ చిత్రానికి సంతకం చేశారు. తమిళ కమెడియన్ సంతానం హీరోగా కన్నన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, జానకి వయసు ఇప్పుడు 87 సంవత్సరాలు.
Wed, Oct 23, 2019, 07:22 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View