మా సినిమా ద్వారానే రజిత పరిచయమైంది: పరుచూరి గోపాలకృష్ణ
Advertisement .b
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ 'రజిత' గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "అవి మేము అక్కినేని నాగేశ్వరరావుగారి 'అగ్నిపుత్రుడు' సినిమా కోసం పనిచేస్తున్న రోజులు. ఆ సినిమాలో ఏఎన్నార్ గారి కూతురు పాత్ర కోసం ఎవరైతే బాగుంటారా అని చూస్తున్నాం. ఆ సమయంలోనే రజిత నా కంటపడింది. అప్పటికి చాలా చిన్న పిల్ల. దాంతో ఆ అమ్మాయిని ఆ సినిమాతో పరిచయం చేశాము.

అలా ఇండస్ట్రీకి పరిచయమైన రజిత, నాకు తెలిసి 500 సినిమాలకి పైగా చేసి ఉంటుంది. ఒక గిరిజ .. గీతాంజలి .. రమాప్రభ బాటలో ఆ తరహా వేషాలు వేస్తూ వెళుతుందని నేను భావించాను. కానీ ఆ అమ్మాయి తను ఎలాంటి పాత్రనైనా చేయగలనని నిరూపించింది. కామెడీ పాత్రలను ఎక్కువగా చేసిన రజిత, 'అడవిలో అన్న' సినిమాలో కంటతడి పెట్టించే పాత్రలోనూ మెప్పించింది. ఆ తరువాత తనకి నంది అవార్డు వచ్చినట్టుగా ఆ అమ్మాయి ఫోన్ చేసినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది" అని చెప్పుకొచ్చారు.
Tue, Oct 22, 2019, 05:26 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View