దుమ్ము రేపేస్తున్న బన్నీ సాంగ్ టీజర్
Advertisement .b
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా 'అల వైకుంఠపురములో' సినిమా షూటింగు జరుపుకుంటోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సాంగ్ టీజర్ ను వదిలారు.

"రాములో రాములా నన్ను ఆగం జేసిందిరో .. రాములో రాములా నా పాణం దీసిందిరో" అంటూ ఈ పాట సాగుతోంది. క్లాస్ సెట్లో మాస్ బీట్ తో సాగే ఈ పాటను బన్నీ .. పూజా హెగ్డే బృందంపై చిత్రీకరించారు. తమన్ స్వరపరిచిన బాణీ బాగుంది. మాస్ ఆడియన్స్ కి ఈ బీట్ మంచి ఊపును .. ఉత్సాహాన్ని తెచ్చేదిలా వుంది. కొరియోగ్రఫీ కూడా బాగుందనే విషయం ఈ చిన్న బిట్ ను బట్టే తెలుస్తోంది. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో బన్నీ కొత్తగా కనిపిస్తున్నాడు. పూర్తి పాటను ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు.
Tue, Oct 22, 2019, 04:43 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View