విజయ్ దేవరకొండ కూడా రంగంలోకి దిగుతున్నాడు
Advertisement
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రం రూపొందుతోంది. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ప్రేమకథా చిత్రం కావడంతో ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయాలని భావించారు. అయితే ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతూ వచ్చింది.

దాంతో ఫిబ్రవరి వరకూ ఆగకుండా ముందుగానే ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారట. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని భావిస్తున్నట్టుగా సమాచారం. అదే రోజున బాలకృష్ణ 'రూలర్' .. సాయిధరమ్ తేజ్ 'ప్రతిరోజూ పండగే' విడుదలకి వున్నాయి. ఈ రెండు సినిమాలతో విజయ్ దేవరకొండ పోటీకి దిగుతున్నాడన్న మాట. 'వరల్డ్ ఫేమస్ లవర్'లో విజయ్ దేవరకొండ సరసన రాశిఖన్నా .. కేథరిన్ .. ఐశ్వర్య రాజేశ్ .. ఎజిబెల్లా నటిస్తుండటం విశేషం.
Tue, Oct 22, 2019, 04:23 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View