ప్రభాస్ ను కలవనున్న 'గీత గోవిందం' దర్శకుడు
Advertisement
ఈ మధ్య కాలంలో కథ .. కథనం .. మాటలు .. పాటలు ఇలా అన్నీ కుదిరిన చిత్రాల జాబితాలో 'గీత గోవిందం' ఒకటిగా కనిపిస్తుంది. యూత్ నుంచి .. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి విశేషమైన రీతిలో ఆదరణ లభించింది. దర్శకుడిగా ఈ సినిమా పరశురామ్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో ఆయన తదుపరి సినిమా పెద్ద హీరోతోనే ఉంటుందనీ .. పెద్ద బ్యానర్లోనే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఇంతవరకూ ఆయన మరో ప్రాజెక్టును పట్టాలెక్కించలేకపోయారు.

ఆయన తదుపరి సినిమా మహేశ్ బాబుతో ఉంటుందని కొన్ని రోజులు .. అఖిల్ తో ఉంటుందని కొన్నిరోజులు ప్రచారం జరిగింది. కానీ అవేవీ నిజం కాలేదు. తాజాగా ఆయన ప్రభాస్ కి కథ వినిపించడానికి సిద్ధమవుతున్నాడనేది ఫిల్మ్ నగర్ టాక్.  ప్రభాస్ కోసం ఒక మంచి కథను సిద్ధం చేసిన పరశురామ్, ఒకటి రెండు రోజుల్లో ఆయనకి ఆ కథను వినిపించనున్నాడట. ప్రభాస్ కి కథ నచ్చితే, ప్రస్తుతం ఆయన చేస్తున్న 'జాన్' తరువాత చేయనున్న సినిమా ఇదే అవుతుందని అంటున్నారు.
Tue, Oct 22, 2019, 03:01 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View