నాకు సిగరెట్ అలవాటు చేసింది ఆ హీరోయినే: షకీల
Advertisement
మలయాళ సినీ రంగాన్ని ఓ ఊపు ఊపిన నటి షకీల. పెద్ద పెద్ద స్టార్లతో సమానంగా క్రేజ్ ను సంపాదించుకున్న నటి ఆమె. ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆమె... ఆ తర్వాత సొంత వ్యక్తులతో పాటు, ఎంతో మంది చేతిలో మోసపోయింది. ఈ విషయాన్ని పక్కన పెడితే... ఆమెకు సిగరెట్ తాగే అలవాటు ఉంది. ఈ అలవాటుపై ఆమె మాట్లాడుతూ, బాలీవుడ్ నటి, నిర్మాత పూజా భట్ వల్లే తనకు సిగరెట్ అలవాటయిందని తెలిపింది.

చెన్నైలో ఓసారి అనుకోకుండా పూజా భట్ కలిసిందని... ఆ సమయంలో ఆమె చాలా స్టైల్ గా సిగరెట్ తాగడం తనను ఆకర్షించిందని చెప్పింది. ఆమె తనకు సిగరెట్ ఇవ్వడంతో కాదనలేక కాల్చానని తెలిపింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అలవాటు కొనసాగుతూనే ఉందని చెప్పింది. సిగరెట్ అలవాటును మానుకోలేకపోతున్నానని తెలిపింది.
Tue, Oct 22, 2019, 01:07 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View