సౌందర్య సినిమాలు టీవీలో చూస్తుంటే మనసు భారమైపోతుంది: డాన్స్ మాస్టర్  స్వర్ణ
Advertisement
తాజా ఇంటర్వ్యూలో డాన్స్ మాస్టర్ స్వర్ణ మాట్లాడుతూ, సౌందర్య గురించి ప్రస్తావించారు. "సౌందర్యతో కూడా నేను ఎంతో సన్నిహితంగా ఉండేదానిని. ఆమె సినిమాల్లోని చాలా పాటలకు నేను పనిచేశాను. తన సినిమాలకి సంబంధించిన విషయాలను మాత్రమే కాకుండా, వ్యక్తిగత విషయాలను కూడా ఆమె నాతో పంచుకునేవారు. సెట్లో ఆమె ఎంతో కలుపుగోలుగా ఉండేవారు .. తరచూ కాల్ చేసి మాట్లాడేవారు.

అలాంటి సౌందర్య హఠాన్మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. సౌందర్య చనిపోయిన తరువాత ఆమె తాలూకు జ్ఞాపకాలు నాకు చాలా బాధ కలిగించాయి. ఇప్పటికీ టీవీల్లో సౌందర్య సినిమాలు చూడను .. మనసు చాలా బరువెక్కుతుంది. అందువల్లనే సౌందర్య సినిమాలు చూడకుండా టీవీ ఆఫ్ చేస్తూ వుంటాను" అని ఆవేదనను వ్యక్తం చేశారు.
Mon, Oct 21, 2019, 05:03 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View