'దేవదాసు'లో షావుకారు జానకి చేయవలసిందట
Advertisement
తెలుగులో సావిత్రి, జమున, కృష్ణకుమారి జోరు సాగుతోన్న సమయంలో, తనదైన ప్రత్యేకతను చాటుకున్న నటిగా 'షావుకారు' జానకి కనిపిస్తుంది. సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ మాట్లాడుతూ ఆమెను గురించి ప్రస్తావించారు. "షావుకారు జానకిగారు నిజ జీవితంలోగానీ, సినిమా జీవితంలోగాని ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. అయితే ఎప్పుడూ కూడా ఆమె మానసికంగా కుంగిపోలేదు .. ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. చాలామందిలా వ్యసనాలకి బానిసై తన కెరియర్ ను పాడుచేసుకోలేదు.

'దేవదాసు' సినిమాలో మొదటిగా జానకిగారికే అవకాశం వచ్చింది. చివరి నిమిషంలో అది సావిత్రిగారి చేతికి వెళ్లింది. అయినా ఆమె ఎంత మాత్రం బాధపడలేదు. తెలుగులో 'రోజులు మారాయి' చేసిన జానకి గారు, తమిళంలోను ఆ పాత్రను తనే చేయాలనుకున్నారుగానీ అది అంజలీదేవిగారికి వెళ్లింది. ఇక తమిళంలో జానకిగారు చేసిన ఒక సినిమా తెలుగులో 'కలెక్టర్ జానకి' పేరుతో రీమేక్ చేస్తుంటే, తనకే ఆ అవకాశం వస్తుందని జానకిగారు భావించగా అది జమునగారికి వెళ్లింది. ఇలాంటి సంఘటనలు వరుసగా ఎదురవుతున్నప్పటికీ ఆమె తట్టుకుని నిలబడటం విశేషం' అని చెప్పుకొచ్చారు.
Mon, Oct 21, 2019, 04:31 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View