అందువల్లనే సిల్క్ స్మిత ఇబ్బందులు పడింది: డాన్స్ మాస్టర్ స్వర్ణ
Advertisement
ఎన్నో సినిమాలకు కొరియోగ్రఫీని అందించిన అనుభవం డాన్స్ మాస్టర్ స్వర్ణ సొంతం. ఆమె కంపోజ్ చేసిన పాటల్లో చాలా సూపర్ హిట్ అయ్యాయి .. ఆమెకి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టాయి. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ 'సిల్క్ స్మిత' గురించి ప్రస్తావించారు. 'సిల్క్ స్మిత' తో కలిసి నేను చాలా సినిమాలకి పని చేశాను. ఆమెను నేను చాలా దగ్గరగా .. ఎక్కువ కాలం చూశాను.

సిల్క్ స్మిత చాలా మంచిది .. ఆమెది పసిపిల్ల మనస్తత్వం. సెట్ లోను ఆమె ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. ఆమె ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాకపోవడం వలన చాలా ఇబ్బదులు పడింది. అప్పట్లో మా పక్క వీధిలోనే ఆమె ఉండేది. ఆమె చనిపోయిందనే విషయం తెలిసి నేను షాక్ అయ్యాను. సిల్క్ స్మిత ఇక లేదని తెలిసి నాకు కన్నీళ్లు ఆగలేదు" అంటూ చెప్పుకొచ్చారు.
Mon, Oct 21, 2019, 04:02 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View