'రామాయణం' తరువాత అందుకే నటించలేదు: స్మితా మాధవ్
Advertisement .b
బాలబాలికలతో దర్శకుడు గుణశేఖర్ 'రామాయణం' చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. 1996లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రశంసలు అందుకుంది. అలాంటి ఈ సినిమాలో సీతాదేవిగా 'స్మితా మాధవ్' నటించింది. ఆ సినిమా ఈ అమ్మాయికి మంచి పేరు తెచ్చిపెట్టినా, ఆ తరువాత మరే చిత్రంలోను నటించలేదు.

తాజా ఇంటర్వ్యూలో ఆమె ఆ విషయాలను గురించి మాట్లాడుతూ .. 'రామాయణం' సినిమాలో సీతాదేవిగా నేను చేయాలనే నిర్ణయం మా అమ్మానాన్నలదే. ఆ సినిమా తరువాత చాలా అవకాశాలు వచ్చాయి. అలా వచ్చిన అవకాశాల్లో మంచి ప్రాజెక్టులు వున్నాయి. అయితే చదువు దెబ్బతింటుందనే ఉద్దేశంతో చేయలేదు. అందుకే ఆ సమయంలో సినిమాలు చేయాలనిపించలేదు .. చేయలేదు. ఆ తరువాత నాకు సినిమాలపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు నాకు నచ్చిన పాత్రలు వస్తే గనుక తప్పకుండా చేస్తాను' అని చెప్పుకొచ్చింది.
Mon, Oct 21, 2019, 03:31 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View