'రాజుగారి గది 3' మూడు రోజుల వసూళ్లు
Advertisement .b
ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ బాబు - అవిక గోర్ నాయకా నాయికలుగా 'రాజుగారి గది 3' రూపొందింది. హారర్ కామెడీగా ఈ నెల 18వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా 3.5 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఈ సినిమాకి అయిన బడ్జెట్ .. అమ్మకాలను బట్టి చూస్తే, లాభాల బాట పట్టడానికి మరికొన్ని రోజులు థియేటర్స్ లో నిలబడవలసి ఉంటుంది.

ఈ వారంలో ఈ సినిమాకి పోటీగా నిలిచే తెలుగు సినిమాలు కూడా ఏమీ లేవు. తమిళ సినిమాలైన 'బిజిల్' .. 'ఖైదీ' సినిమాలు మాత్రం రంగంలోకి దిగుతున్నాయి. విజయ్ హీరోగా రూపొందిన 'బిజిల్' పై .. కార్తీ హీరోగా చేసిన 'ఖైదీ'పై అందరిలోనూ ఆసక్తి వుంది. ఈ రెండు సినిమాలను కూడా ఈ నెల 25న వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. మరి ఈ పోటీని 'రాజుగారి గది 3' ఎంతవరకూ తట్టుకుని నిలబడుతుందో చూడాలి.
Mon, Oct 21, 2019, 02:39 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View