'సైరా నరసింహా రెడ్డి' 18 రోజుల వసూళ్లు
Advertisement
చిరంజీవి - సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన 'సైరా నరసింహారెడ్డి' ఈ నెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా విజయవిహారాన్ని కొనసాగిస్తూనే వుంది. నయనతార .. తమన్నా కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల్లో 104 కోట్ల షేర్ ను సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా 229 కోట్ల గ్రాస్ ను .. 140 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ 18 రోజుల్లో ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా 32 కోట్లకి పైగా వసూలు చేయడాన్ని విశేషంగా చెప్పుకుంటున్నారు. తెలుగుతోపాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కావడం, భారీ తారాగణం .. ఆసక్తిని రేకెత్తించే కథనం .. ఆకట్టుకునే చిత్రీకరణ ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు లభించడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Mon, Oct 21, 2019, 02:06 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View