అధికారం కోల్పోయాక శ్రీరంగ నీతులు చెబుతున్నారు: విజయసాయి రెడ్డి
Advertisement
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారంటూ వస్తున్న విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. 'సీఎం జగన్ సొంత ప్రతిష్టను పెంచుకోవడానికి అప్పు చేసి పప్పుకూడు పెడుతున్నారని ‘కిరసనాయిలు’ తన టీవీలో ఏడుపు రాగాలు తీశాడు. మరి చంద్రబాబు నాయుడు 2.60 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన సంగతిని మాత్రం చెప్పడు. 60 వేల కోట్ల రూపాయల పెండింగు బిల్లులు మిగిల్చి వెళ్లిన విషయం ప్రస్తావించడు. దోపిడీలో తనూ భాగస్వామే కదా!' అని ఓ మీడియా అధినేతపై విమర్శలు గుప్పించారు.

'దేశంలోనే అత్యంత అసమర్థ ఆర్థిక మంత్రిగా యనమల రికార్డులకెక్కారు. అధిక వడ్డీ ఆశ చూపి దొరికిన చోటల్లా అప్పు చేసి బోర్డు తిప్పేసే ఫైనాన్స్ కంపెనీ కంటే దారుణంగా ఆర్థిక నిర్వహణ సాగింది ఆయన హయాంలో. అధికారం కోల్పోయాక శ్రీరంగ నీతులు చెబుతున్నారు' అని మరో ట్వీట్ లో విమర్శలు చేశారు.
Mon, Oct 21, 2019, 02:03 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View