'కేజీఎఫ్' దర్శకుడితో మహేశ్ బాబు నెక్స్ట్ మూవీ
Advertisement
ప్రస్తుతం మహేశ్ బాబు .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తదుపరి సినిమాను దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు చేయాలనుకున్నాడు. అందుకు సంబంధించిన కథపైనే వంశీ పైడిపల్లి కసరత్తు చేస్తున్నాడు.

అయితే ఈ కథ బౌండ్ స్క్రిప్ట్ రూపంలో చేతికి వచ్చి .. అన్నీ సెట్ చేసుకోవడానికి మరో నాలుగైదు నెలల సమయం పట్టొచ్చని వంశీ పైడిపల్లి చెప్పినట్టు సమాచారం. దాంతో ఈ గ్యాప్ లో 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలనే ఉద్దేశంతో మహేశ్ ఆయనకి కాల్ చేశాడనీ .. ఇటీవలే ఇద్దరి మధ్య చర్చలు జరిగిపోయాయని చెబుతున్నారు. సాధ్యమైనంత వరకూ ఈ ప్రాజెక్టే పట్టాలెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు.
Mon, Oct 21, 2019, 12:01 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View