హుజూర్ నగర్ ఉపఎన్నిక.. మొరాయించిన ఈవీఎం
Advertisement
హుజూర్ నగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే, నియోజక వర్గంలోని మేళ్లచెరువులోని 133 కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. దీంతో, వెంటనే మరో ఈవీఎంను అధికారులు ఏర్పాటు చేశారు. ఇది కూడా పని చేయకుండా మొరాయించడంతో ఆ బూత్ లో పోలింగ్ ను అధికారులు నిలిపేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి యత్నిస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 2,36,842 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వీరి కోసం 302 పోలింగ్ కేంద్రాల్లో 1708 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

నియోజకవర్గంలో మొత్తం 79 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఈ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వెబ్ క్యాస్టింగ్ ను ఏర్పాటు చేశారు.
Mon, Oct 21, 2019, 11:44 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View