'వెంకీమామ' రిలీజ్ డేట్ పై డౌట్!
Advertisement
బాబీ దర్శకత్వంలో వెంకటేశ్ - చైతూ కథానాయకులుగా 'వెంకీమామ' చిత్రం రూపొందింది. గ్రామీణ నేపథ్యంలో పూర్తి వినోదభరితంగా నిర్మితమైన సినిమా ఇది. ఈ కారణంగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే రీసెంట్ గా మాత్రం ఈ విషయంలో ఎలాంటి హడావిడి కనిపించడం లేదు. దాంతో సంక్రాంతికి ఈ సినిమా వస్తుందా .. రాదా? అనే సందేహం అభిమానుల్లో చోటుచేసుకుంది.

నిజానికి ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ఉందట. ఆల్రెడీ పూర్తయి వచ్చిన గ్రాఫిక్స్ వర్క్ సురేశ్ బాబుకి నచ్చకపోవడం వలన, పర్ఫెక్ట్ గా చేసి పంపించమని చెప్పేసి వెనక్కి పంపించేశారట. రెండు రోజుల్లో ఆ అవుట్ పుట్ రానుంది .. అది సురేశ్ బాబుకి నచ్చితే, దానిని బట్టి విడుదల తేదీని ప్రకటించడం జరుగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్ .. చైతూ జోడీగా రాశి ఖన్నా నటించిన సంగతి తెలిసిందే.
Mon, Oct 21, 2019, 11:39 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View