అజ్ఞాతంలో రేవంత్.. ఖబడ్దార్ అంటూ కేసీఆర్ కు ట్విట్టర్ ద్వారా హెచ్చరిక!
Advertisement
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరుకుంది. సమ్మెకు సంఘీభావం తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో, కీలక నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఆచూకీ మాత్రం దొరకలేదు. ఆయన కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో, ట్విట్టర్ ద్వారా రేవంత్ స్పందించారు. మెట్రో రైల్, ప్రగతి భవన్ గేట్లు మూసుకుని కూర్చున్న కేసీఆర్ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. అంజన్ యాదవ్, రాములు నాయక్ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నానని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Mon, Oct 21, 2019, 11:03 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View