'మా'లో రచ్చకెక్కిన విభేదాలు.. జీవిత స్పందన
Advertisement
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో విభేదాలు రచ్చకెక్కాయి. అధ్యక్షుడు నరేశ్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మధ్య అగాధం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో, మా సభ్యులతో నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నరేశ్ హాజరు కాకపోవడం పెద్ద చర్చకు దారి తీసింది.

ఈ నేపథ్యంలో జీవిత మాట్లాడుతూ, మా సభ్యుల మధ్య విభేదాలు తార స్థాయికి చేరిన మాట నిజమేనని అంగీకరించారు. ఈ కారణం వల్లే సమావేశాన్ని ఏర్పాటు చేశామని... ఎవరెవరు ఏమేం చేస్తారు? ఎవరెవరు ఏమేం చేయలేరు? అనే విషయాన్ని చర్చించేందుకు సమావేశాన్ని నిర్వహించామని చెప్పారు.

ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులతోనే సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ, అది సాధ్యపడలేదని జీవిత తెలిపారు. ఈ కారణం వల్లే అసోసియేషన్ లోని అందరు సభ్యులతో సమావేశాన్ని నిర్వహించాల్సి వచ్చిందని చెప్పారు. 26 మంది కమిటీ సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు యత్నిస్తున్నామని తెలిపారు.
Mon, Oct 21, 2019, 10:48 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View