అనుకున్నదే అయింది! బిగ్‌బాస్ నుంచి వితిక ఔట్.. హత్తుకుని ఏడ్చేసిన వరుణ్!
Advertisement
లీకు నిజమైంది. బిగ్‌బాస్ హౌస్ నుంచి వితిక ఎలిమినేట్ అయింది. భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో వరుణ్ ఒంటరిగా మారాడు. 90 రోజుల తర్వాత వరుణ్‌కు ఎడబాటు తప్పలేదు. వితిక ఎలిమినేట్ కాబోతోందంటూ ముందే లీకులు బయటకు వచ్చాయి. గతంలో ఓసారి అంచనా తప్పడంతో ‘బిగ్‌బాస్’ అభిమానులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే, ఈసారి మాత్రం అంచనా తప్పలేదు. అతి తక్కువ ఓట్లు రావడంతో వితిక ఎలిమినేట్ అయినట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించాడు.

ఇన్ని రోజులపాటు హౌస్‌లో కలిసి ఉన్న భార్య వితిక వెళ్లిపోతుంటే వరుణ్ సందేశ్ తట్టుకోలేకపోయాడు. గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు. దీంతో వితిక కూడా కన్నీరుపెట్టుకుంది. ‘మా ఆయనను జాగ్రత్తగా చూసుకోండి’ అని సభ్యులకు చెప్పి వరుణ్‌కు ముద్దిచ్చి హౌస్ నుంచి బయటకు వెళ్లింది.

హౌస్ నుంచి స్టేజ్‌పైకి వచ్చిన వితిక.. నాగార్జున చూపించిన తన జర్నీ చూసి ఆశ్చర్యపోయింది. బిగ్‌బాస్ ప్రయాణాన్ని తన మనవళ్లకు చూపించుకోవచ్చని నవ్వుతూ చెప్పింది. కాగా, వితిక వెళ్తూ వెళ్తూ రాహుల్‌పై బిగ్‌బాంబ్ విసిరింది. ఈ బాంబ్ ప్రకారం ‘బిగ్‌బాస్’ ఆపమని చెప్పేంత వరకు హౌస్‌లోని బాత్రూములన్నీ రాహుల్ ఒక్కడే శుభ్రం చేయాలి.
Mon, Oct 21, 2019, 06:50 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View