ఈ సీజన్ ‘బిగ్ బాస్’పై శివబాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement .b
ప్రముఖ నటుడు, ‘బిగ్ బాస్’ సీజన్ వన్ విన్నర్ శివబాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సీజన్ ‘బిగ్ బాస్’ ను మొదట్లో చూశానని, ఆ తర్వాత చూడట్లేదని చెప్పారు. ఓ యూ ట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ సీజన్ ‘బిగ్ బాస్’ ను తాను చూడకపోవడానికి గల కారణాలను వివరించాడు. తనకు ఎంటర్ టైన్ మెంట్ అంటే చాలా ఇష్టం అని, అయితే, అది ఈ సీజన్ లో లోపించిందని, అందుకే, ఈ సీజన్ తనకు కనెక్ట్ కాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం షూటింగ్స్ తో బిజీగా ఉండటం, వ్యక్తిగత పనుల కారణంగా ఈ సీజన్ ‘బిగ్ బాస్’ ను పూర్తిగా చూడలేకపోతున్నానని చెప్పారు.  
Sun, Oct 20, 2019, 03:05 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View