అజిత్ 60వ చిత్రం టైటిల్ ఖరారు
Advertisement
శ్రీదేవి కుటుంబంతో అజిత్ కి మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన బోనీకపూర్ అడిగిన వెంటనే అజిత్ ఎంతమాత్రం ఆలోచించకుండా బాలీవుడ్ మూవీ 'పింక్' రీమేక్ లో చేశాడు. 'నెర్కొండ పార్వై ' టైటిల్ తో దర్శకుడు వినోద్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా తమిళనాట మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఇదే కాంబినేషన్లో మరో సినిమా నిర్మాణానికి రంగం సిద్ధమైంది.

బోనీకపూర్ నిర్మాతగా .. వినోద్ దర్శకుడిగా .. అజిత్ హీరోగా ఈ సినిమా నిన్న పూజ కార్యక్రమాలను జరుపుకుంది. కెరియర్ పరంగా అజిత్ కి ఇది 60వ సినిమా. ఈ సినిమాకి 'వలిమై' అనే టైటిల్ ను ఖరారు చేశారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించే ఈ సినిమా, డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
Sat, Oct 19, 2019, 03:13 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View