అజర్ బైజాన్ కు వెళుతోన్న కార్తికేయ
Advertisement
ఇటీవల కాలంలో అటు బాలీవుడ్ దర్శకులు .. ఇటు టాలీవుడ్ దర్శకులు అజర్ బైజాన్ లో పాటలను చిత్రీకరించడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతున్నారు. తన తాజా చిత్రం కోసం అక్కడికి వెళ్లడానికి హీరో కార్తికేయ కూడా సిద్ధమవుతున్నాడు. కార్తికేయ హీరోగా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో '90ML' చిత్రం రూపొందుతోంది. నేహా సోలంకి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా తాజాగా టాకీ పార్టును పూర్తి చేసుకుంది.

రెండు పాటల చిత్రీకరణకు గాను అజర్ బైజాన్ రాజధాని 'బాకు'కు వెళుతున్నట్టుగా చిత్ర నిర్మాత అశోక్ రెడ్డి తెలియజేశారు. ఎంబీఏలో గోల్డ్ మెడల్ ను సాధించిన హీరో, ఆథరైజ్డ్ డ్రింకర్ గా ఎందుకు మారాడు? అనే కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుందట. మోడ్రన్ దేవదాసులా కార్తికేయ కనిపించే ఈ సినిమాలో, పోసాని .. రావు రమేశ్ .. రవికిషన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.
Sat, Oct 19, 2019, 01:52 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View