సంక్రాంతి బరిలో బాలయ్య మూవీ లేనట్టే!
Advertisement .b
బాలకృష్ణ కథానాయకుడిగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ .. వేదిక నటిస్తున్నారు. డిఫరెంట్ గెటప్ లో బాలకృష్ణ ఈ సినిమాలో కనిపించనున్నారు. మొదటి నుంచి బాలకృష్ణకి సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. సంక్రాంతికి తన సినిమా తప్పకుండా బరిలో ఉండాలని ఆయన భావిస్తారు.

అందువలన ఈసారి కూడా సంక్రాంతికి ఆయన సినిమా ఉంటుందని అభిమానులు ఆశించారు. అయితే ఈ సంక్రాంతికి గట్టిపోటీ వుంది. మహేశ్ బాబు 'సరిలేరు నీ కెవ్వరు' .. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సంక్రాంతికి బరిలోకి దిగనున్నాయి. ఇక రజనీ 'దర్బార్' కూడా రంగంలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3వ వారంలో ప్రేక్షకుల ముందుకు వెళ్లాలని బాలకృష్ణ భావించినట్టుగా సమాచారం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.
Sat, Oct 19, 2019, 09:21 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View