రేపు బంద్ నేపథ్యంలో ఓయూ పరిధిలో జరిగే పరీక్షలు వాయిదా
Advertisement
రేపు  ఆర్టీసీ కార్మికులు తెలంగాణ బంద్ తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ  నేపథ్యంలో శనివారం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్శిటీ అధికారులు ఒక ప్రకటన  చేశారు. వాయిదా పడ్డ పరీక్షలు తిరిగి  ఎప్పుడు నిర్వహించేది  తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. విద్యార్థుల ప్రయాణ సౌకర్యాలకు ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

Fri, Oct 18, 2019, 09:57 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View